ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అయేషా హత్య కేసు: నిందితుడి అరెస్టు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన భీఫార్మసీ విద్యార్థిని అయేషా హత్య కేసులో ఎట్టకేలకు ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల సమీపంలో చెలగల్లు గ్రామంలో ఉపేంద్ర అనే వ్యక్తిని అరెస్టు చేశారు. గత ఏడాది డిసెంబరులో హత్య జరుగగా, ఈ కేసులో ఇప్పటికి క్లూ సాధించగలిగారు. అరెస్టు చేసిన ఉపేంద్రను రహస్యంగా ఇబ్రహీంపట్నం తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

విశాఖ జైలులో శిక్షను అనుభవిస్తున్న గుర్విందర్ సింగ్ అలియాస్ లడ్డు అనుచరుడిగా ఉపేంద్రను గుర్తించారు. అయేషా హత్యకేసులో లడ్డును సహ నిందితుడిగా పోలీసులు చేర్చనున్నారు. ఈ కేసులో లడ్డు అరెస్టుకు పోలీసులు మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటి వారంట్ దాఖలు చేశారు. తమ కూతురు హత్య కేసులో మంత్రి కోనేరు రంగారావు మనువడి పాత్ర ఉందని అయేషా తల్లిదండ్రులు ఆరోపించిన విషయం తెలిసిందే.

ఈ పరిస్థితుల్లో ఉపేంద్రను రాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. విజయవాడలో బీఫార్మసీ చదువుతున్న ఆయేషా, తన హాస్టల్ గదిలో హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ కేసులోని మిస్టరీని చేధించేందుకు పోలీసులు అపసోహాలు పడ్డారు.
మరిన్ని
తరుగుతున్న మమకారం... చెత్తకుప్పలో మృత శిశువు  
సెంటిమెంట్ తెరాస సొత్తు కాదు: వైఎస్
డాక్టర్ కోర్సు వేస్ట్... ఇంజనీర్ బెస్ట్  
బుష్ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు  
మిర్చి రైతులను ఆదుకుంటాం: మంత్రి కన్నా
అగ్ని ప్రమాద నష్టంపై స్పష్టత లేని సీఎం: బాబు