ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం: లఢ్హా
ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన గుంటూరు మిర్చి యార్డులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ఆ జిల్లా ఎస్పీ మహేష్ చంద్ర లఢ్హా బుధవారం వెల్లడించారు. ఈ ప్రమాదంపై ప్రాథమిక విచారణ జరిపిన ఎస్పీ.. ఒక నివేదికను తయారు చేసి, ప్రభుత్వానికి అందజేశారు.

గుంటూరు మిర్చి యార్డులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువ చేసే మిర్చి పంట బుగ్గిపాలైన విషయం తెల్సిందే. అయితే ఈ ప్రమాదం వెనుక కాంగ్రెస్ నేతల కుట్ర ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా మార్కెట్ స్థలాన్ని స్వాహా చేసేందుకు ముఖ్యమంత్రి, మార్కెట్ యార్డు ఛైర్మన్‌లు కుట్ర పన్నారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదంపై ఎస్పీ విచారణ జరిపి ప్రాథమిక నివేదిక తయారు చేశారు. ఇదిలావుండగా అగ్ని ప్రమాదంలో పంటను కోల్పోయిన వారికి నష్ట పరిహారం చెల్లించే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేయనున్నారు.
మరిన్ని
తెలంగాణా 'యముడు' కేసీఆర్: జీవన్ రెడ్డి
అయేషా హత్య కేసు: నిందితుడి అరెస్టు
తరుగుతున్న మమకారం... చెత్తకుప్పలో మృత శిశువు  
సెంటిమెంట్ తెరాస సొత్తు కాదు: వైఎస్
డాక్టర్ కోర్సు వేస్ట్... ఇంజనీర్ బెస్ట్  
బుష్ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు