ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఉప ఎన్నికలు: విష్ణు నామినేషన్ దాఖలు
ఈనెలలో జరుగనున్న ఉప ఎన్నికల్లో భాగంగా ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి, దివంగత పి.జనార్థన్ రెడ్డి కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి బుధవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆయన వెంట ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (పిసిసి) అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌తో పాటు.. మంత్రులు అంజన్ కుమార్ యాదవ్, వనమా వెంకటేశ్వరరావు, పార్టీ నేతలు మర్రి శశిధర్ రెడ్డిలు ఉన్నారు.

విష్ణువర్థన్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి జనార్థన్ రెడ్డి అనుచరులు, సన్నిహితులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఖైరతాబాద్‌ నుంచి లక్డీకాఫూల్ వరకు వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా 'కార్మిక నేత జనార్థన్ రెడ్డి అమరహై, విష్ణు జిందాబాద్' అంటూ అభిమానులు పెద్దఎత్తున నినాదాలు చేశారు.

నామినేషన్ అనంతరం పిసిసి చీఫ్ డి.శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఖైరతాబాద్‌ స్థానంలో తమ అభ్యర్థులను పోటీకి దింపాలని భావించే పార్టీలు ఒకసారి ఆలోచించాలని కోరారు. అలాగే మంత్రి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ఈ స్థానం నుంచి ఎవరు పోటీ చేసినా విష్ణు భారీ మెజారిటీతో గెలుపొందటం ఖాయమని జోస్యం చెప్పారు.
మరిన్ని
గోల్డ్‌క్వెస్ట్ ఆఫీసులు మూత: బాధితుల ఆందోళన
షాట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం: లఢ్హా
తెలంగాణా 'యముడు' కేసీఆర్: జీవన్ రెడ్డి
అయేషా హత్య కేసు: నిందితుడి అరెస్టు
తరుగుతున్న మమకారం... చెత్తకుప్పలో మృత శిశువు  
సెంటిమెంట్ తెరాస సొత్తు కాదు: వైఎస్