ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శతకోటి లింగాల్లో ఆయన 'ఓ బోడిలింగం': కేసీఆర్
WD
మరో మూడు వారాల్లో తెలంగాణా జిల్లాల్లో ఉపఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలలో విజయం సాధించాలని మండువేసవిని సైతం లెక్కచేయక ఆయా పార్టీల నాయకులు ప్రజలముందుకు వెళుతున్నారు. మరోవైపు ముఖ్య నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తెదేపా నాయకుడు టి.దేవేందర్‌ను "బోడిలింగం" అంటూ... ఆయనపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రత్యేక తెలంగాణా విషయంలో తెదేపా స్పష్టమైన వైఖరిని తెలియజేయకుండా దాటవేస్తోందని ఆరోపించారు.

మొత్తమ్మీద తెలంగాణా సెంటిమెంట్‌‌ అస్త్రాన్ని ఉపయోగించి ఘన విజయాన్ని సాధించాలని తెరాస ఉవ్వీళ్లూరుతోంది. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే గెలిపిస్తాయని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక తెలుగుదేశం... తమదైన శైలిలో ప్రచారాన్ని సాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది.
వీడియోను వీక్షించండి
మరిన్ని
ఉప ఎన్నికలు: విష్ణు నామినేషన్ దాఖలు
గోల్డ్‌క్వెస్ట్ ఆఫీసులు మూత: బాధితుల ఆందోళన
షాట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం: లఢ్హా
తెలంగాణా 'యముడు' కేసీఆర్: జీవన్ రెడ్డి
అయేషా హత్య కేసు: నిందితుడి అరెస్టు
తరుగుతున్న మమకారం... చెత్తకుప్పలో మృత శిశువు