ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బ్రిటన్‌లో తెలుగు విద్యార్థిని దారుణ హత్య
బ్రిటన్‌లో వైద్యవిద్య నభ్యసించేందుకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థిని మంగళవారం దారుణ హత్యకు గురైంది. విజయవాడకు చెందిన జ్యోతిర్మయి (24)ని బర్మింగ్‌హామ్‌లోని ఆమె నివసిస్తున్న అద్దె అపార్ట్‌మెంట్‌లో ఎవరో దుండగులు హతమార్చారు.

యూనివర్శిటీ ఆఫ్ వోల్వర్ హాంప్టన్‌లో చదువుతున్న జ్యోతిర్మయి హత్యకు గురైందన్న విషయం తెలుసుకుని హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆమె మృత దేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

ఆమెతో పాటు మరో వ్యక్తికి కూడా గాయాలైనట్టు తెలిసింది. దీంతో ఈ దిశగా దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు చుట్టు పక్కల ఇళ్ల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు.
మరిన్ని
శతకోటి లింగాల్లో ఆయన 'ఓ బోడిలింగం': కేసీఆర్  
ఉప ఎన్నికలు: విష్ణు నామినేషన్ దాఖలు
గోల్డ్‌క్వెస్ట్ ఆఫీసులు మూత: బాధితుల ఆందోళన
షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం: లఢ్హా
తెలంగాణా 'యముడు' కేసీఆర్: జీవన్ రెడ్డి
అయేషా హత్య కేసు: నిందితుడి అరెస్టు