ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నిందితుడు లడ్డూకు ఎన్‌కౌంటర్ భయం
బీఫార్మసి విద్యార్థిని అయేషా హత్య కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న లడ్డూకు ఎన్‌కౌంటర్ భయం పట్టుకుంది. అయేషాను హత్య చేసినట్టు అంగీకరిస్తే రూ.25 లక్షలు ఇస్తామని అప్పటి విజయవాడ నగర పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్, ఏసీపీ విజయకుమార్‌లు ఆశ చూపారని లడ్డూ ఆరోపించిన విషయం తెల్సిందే. ఈ మేరకు విజయవాడ కోర్టు మేజిస్ట్రేట్‌కు లడ్డూ లేఖ కూడా రాశాడు.

ఈ పరిస్థితుల్లో లడ్డూ వద్ద విచారణ జరిపేందుకు తమ కష్టడీకి అప్పగించాలని కోరుతూ విజయవాడ పోలీసులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు వచ్చే సోమవారం విచారణ జరుపనుంది. ఇదిలావుండగా లడ్డూను శుక్రవారం విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

పోలీసులే తనను ఈ కేసులో ఇరికించారని లడ్డూ కోర్టు ప్రాంగణంలో కేకలు పెట్టాడు. మేజిస్ట్రేట్ లడ్డూకు ఈనెల 23వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపుతూ ఆదేశించారు. అనంతరం లడ్డూను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు.
మరిన్ని
జ్యోతిర్మయి హంతకుడు నాగరాజు: లండన్ పోలీసులు
చిత్ర పరిశ్రమ కన్నతల్లిలాంటింది: చంద్రమోహన్
పేదల గృహ రుణాలను రద్దు చేస్తాం  
బ్రిటన్‌లో తెలుగు విద్యార్థిని దారుణ హత్య
శతకోటి లింగాల్లో ఆయన 'ఓ బోడిలింగం': కేసీఆర్  
ఉప ఎన్నికలు: విష్ణు నామినేషన్ దాఖలు