గాన గంధర్వుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణను విజయనగరం జిల్లాలోని ఆత్రేయ స్మారక కళాపీఠం సంగీత పురస్కారంతో సత్కరించింది. తన తీయని కంఠస్వరంతో శ్రోతలను మైమరిపించే బాలమురళీని ఆత్రేయ జయంతి సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంగళంపల్లి మాట్లాడుతూ... విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ కళారకారుల పేరును చిరస్మరణీయంగా ఉంచేందుకు వారి జన్మించిన ప్రాంతాలకు వారి పేర్లనే పెట్టాలని సూచించారు.
ప్రముఖ హరికథా కళాకారుడు ఆదిభట్ల నారాయణదాసు, ప్రసిద్ధ వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామినాయుడు పేర్లను వారి ప్రాంతాలకు పెట్టాలని సూచించారు. ఈ మహోన్నత కార్యం కార్యరూపం దాల్చితే తాను విజయనగరం జిల్లాలో ఉచితంగా కచేరి చేస్తానని తెలిపారు.
|