ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ధరల అదుపునకు పటిష్ట చర్యలు: మంత్రి ఆనం
రాష్ట్రంలో పెరిగిపోతున్న నిత్యావసర సరకుల ధరలను అదుపు చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రాష్ట్ర సమాచార శాఖామంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముఖ్యమంత్రి వైఎస్సార్ అధ్యక్షతన జరిగింది. ఇందులో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను మంత్రి ఆనం మీడియాకు వెల్లడించారు.

నిత్యావసర ధరల అదుపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఆదేశించారని మంత్రి ఆనం తెలిపారు. అంతేకాకుండా జులై నుంచి రేషన్ దుకాణాల్లో కిలో కందిపప్పు రూ.30, లీటర్ పామాయిల్ రూ.45కు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు.

ఇందుకోసం రాష్ట్రానికి 19 వేల టన్నుల పామాయిల్‌ను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరాలని క్యాబినెట్‌ నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే ఈనెల 12 నుంచి జూన్ మూడో తేదీ వరకు అన్ని జిలాల్లో రైతు చైతన్య యాత్రలను నిర్వహించనున్నట్టు మంత్రి రామనారాయణ రెడ్డి తెలిపారు.
మరిన్ని
గానగంధర్వునికి సంగీత పురస్కారం  
నిందితుడు లడ్డూకు ఎన్‌కౌంటర్ భయం
జ్యోతిర్మయి హంతకుడు నాగరాజు: లండన్ పోలీసులు
చిత్ర పరిశ్రమ కన్నతల్లిలాంటింది: చంద్రమోహన్
పేదల గృహ రుణాలను రద్దు చేస్తాం  
బ్రిటన్‌లో తెలుగు విద్యార్థిని దారుణ హత్య