జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'కంత్రీ' చిత్రం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదల సందర్భంగా అనంతపూర్ జిల్లా తాడిపత్రిలోని లక్ష్మీనారాయణ థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో ప్రసాద్ అనే యువకుడుకు మృత్యువాత పడ్డాడు. మరికొందరు గాయపడ్డారు. గతంలో కూడా ఈ థియేటర్ వద్ద తొక్కిసలాటలు జరిగాయి.
అయినప్పటికీ కొత్త సినిమాల విడుదల సమయంలో థియేటర్ యాజమాన్యంగానీ, పోలీసులు గానీ ఏ విధమైన ముందస్తు చర్యలు చేపట్టక పోవడంతో శుక్రవారం మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. కాగా, 'కంత్రీ' చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్, రమేష్ మెహర్ దర్శకత్వంలో నిర్మించిన విషయం తెల్సిందే.
ఇదిలావుండగా 'కంత్రీ' విడుదలను పురస్కరించుకుని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్‌కు అభినందనలు తెలిపారు. నందమూరి వంశ నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న యువ నటుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు పేర్కొన్నారు.
|