ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఖైరతాబాద్‌ విజయం మాకు బోనస్: కేసీఆర్
ఉప ఎన్నికలు జరుగుతున్న 18 స్థానాల్లో విజయం మాదేనని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ధీమా వ్యక్తం చేశారు. నాలుగు లోక్‌సభ సీట్లతో సహా ఖైరతాబాద్ విజయం బోనస్‌గా స్వీకరించి 18 స్థానాల్లో గెలుపొందుతామన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం, సీపీఎం పార్టీల పొత్తు పచ్చి అవకాశవాదమని కేసీఆర్ ఆరోపించారు. ముఖ్యంగా తెదేపా అధినేత చంద్రబాబు అధికార దాహంతో ఉన్నారని ధ్వజమెత్తారు.

అందువల్లే గతంలో భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపిన చంద్రబాబు ఈ ఉప ఎన్నికల్లో సీపీఎం పార్టీతో జతకట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇకపోతే తెలంగాణా ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెపుతారని ఆయన జోస్యం చెప్పారు. క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ.పాల్‌పై ముఖ్యమంత్రి వైఎస్సార్ కక్ష కట్టారని, అందువల్లే పాల్ నడుపుతున్న సంస్థలకు విదేశీ సంస్థల నుంచి నిధులు రాకుండా అడ్డుకున్నారని కేసీఆర్ ఆరోపించారు.
మరిన్ని
'జడ్ కేటగిరి' భద్రత వద్దన్న మెగాస్టార్..!!
అగ్ని-5 తయారీపై దృష్టి సారించిన డీఆర్‌డీవో
తెరాసకు భంగపాటు తప్పదు: రాఘవులు
'ఆరోగ్య శ్రీ'తో కార్పోరేట్ ఆస్పత్రుల పంట: బాబు
'కంత్రీ' థియేటర్ వద్ద తొక్కిసలాట: ఒకరి దుర్మరణం
ధరల అదుపునకు పటిష్ట చర్యలు: మంత్రి ఆనం