తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు సాగుతాయి. బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికంగా 'గరుడ' పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేవీ.రామాచారి, ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాసుదేవన్‌లతో పాటు ఆలయ ప్రధానార్చకులు, ఇతర పూజారులు, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా తితిదే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గోవిందరాజ స్వామి ఆలయానికి ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సు సర్వీసులను నడుపుతోంది.
|