ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆహార ధాన్యాల కొరతపై ఆందోళన
FileFILE
అంతర్జాతీయంగా ఆహార ధాన్యాల కొరత నెలకొంది. దీంతో పలు ప్రపంచ దేశాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా.. భారత్, థాయ్‌లాండ్ వంటి దేశాలు విదేశాలకు ఆహారధాన్యాలను ఎగుమతి చేయకుండా నిషేధం విధించాయి. దీనిపై కొన్ని ఆసియా దేశాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇతర దేశాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే దేశాలు తమ ఎగుమతులపై నిషేధం తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఆహార నిల్వలు తగ్గిపోవడానికి ప్రధానం కారణం.. మధ్య తరగతి భారతీయుల్లో ఆహార వినియోగం ఎక్కువకావడమేనని అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ అన్నారు.

ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో ఆహార ధాన్యాల కొరతపై ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార ధాన్యాల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఆసియా అభివృద్ధి బ్యాంకు విజ్ఞప్తి చేస్తోంది.
వీడియోను వీక్షించండి
మరిన్ని
వికారాబాద్‌కై పార్టీల వ్యూహాలు  
వామపక్షాలు ఎన్నటికీ తోక పార్టీలే: కేసీఆర్  
తెరాస రాజకీయ మనుగడకు పరీక్ష: వెంకయ్య
రేపటి నుంచి పద్మావతి ఉత్సవాలు ప్రారంభం
గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
అప్పుల ఊబిలో తిరుమల వ్యాపారులు