ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తూగో మెట్ట ప్రాంతాల్లో చిరుత సంచారం
FileFILE
తూర్పు గోదావరి (తూగో) జిల్లా మెట్ట ప్రాంతాల్లో చిరుత పులి సంచారం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇటీవల రాజమండ్రిలోని లలితా నగర్‌లోని ఒక ఇంటి బాత్‌రూమ్‌లోకి దూరిన చిరుత పులిని, అటవీ సిబ్బంది చాకచక్యంగా బంధించి అడవుల్లోకి వదిలి పెట్టారు. తాజాగా తూగో జిల్లా గోకవరం ప్రాంతంలోని మెట్ట పొలాల్లో చిరుత సంచారం ఉన్నట్టు స్థానికులు చెప్పారు.

తొలుత స్థానికుల మాటలను కొట్టిపారేసిన ఫారెస్ట్, పోలీసు అధికారులు, ఆ ప్రాంతంలో తనిఖీలు చేసిన తర్వాత చిరుత సంచారం ఉన్నట్టు గుర్తించారు. దీంతో పోలీసులు, గ్రామస్తులు పగలు, రాత్రి పూట గస్తీలో ఉంటున్నారు. నానాటికి తరగి పోతున్న అడవులు, నీటి ఎద్దడి, కార్చిచ్చు కారణంగా చిరుత వంటి క్రూరమృగాలు జనావాస ప్రాంతాలకు తరలి వస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
వీడియోను వీక్షించండి
మరిన్ని
ఆహార ధాన్యాల కొరతపై ఆందోళన  
వికారాబాద్‌కై పార్టీల వ్యూహాలు  
వామపక్షాలు ఎన్నటికీ తోక పార్టీలే: కేసీఆర్  
తెరాస రాజకీయ మనుగడకు పరీక్ష: వెంకయ్య
రేపటి నుంచి పద్మావతి ఉత్సవాలు ప్రారంభం
గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం