సాధారణంగా వేసవి సెలవుల్లోనే జంతు ప్రదర్శనశాలలు, స్నేక్ పార్కులు వంటి పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. జంతువులనూ చూస్తూ రోజంతా సంతోషంగా గడపాలని భావించే.. సందర్శుకులు పార్కులకు వెళుతుంటారు. అయితే అక్కడ ఉండే మూగ జీవులు మాత్రం సూర్య తాపానికి నోరెళ్లబెడతున్నాయి. మరికొన్ని సూర్యతాపాన్ని తట్టుకోలేక నీటిలోనుంచి బయటకు వచ్చేందుకు సాహసించడం లేదు.
అలాంటి మూగ జీవుల కష్టాలను హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో చూడొచ్చు. దీంతో వీటిని చూసేందుకు వెళ్లే పర్యాటకులకు తీవ్ర నిరాశే మిగులుతుంది. ముఖ్యంగా చిన్నారులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. దీంతో చేసేదేమి లేక వెనక్కి తిరిగి వెళుతున్నారు.
|