తమ హయాంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ కోల్డ్ స్టోరేజ్ సంస్థకూ రాయితీ అందించామని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. ఆ సంస్థకు మాత్రమే రూ. 78 లక్షల మేర సబ్సిడీ అందించామన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో బుధవారం జరిగిన పునరంకిత సభలో ఆయన ప్రసంగిస్తూ పేదలతో పాటు బాబు వంటి పెద్ద పారిశ్రామిక వేత్తలకూ సాయం చేస్తున్నామన్నారు.
పరిటాల రవి హత్య కేసుకు సంబంధించి తన కుమారుడిపై ఆరోపణలు చేయగా, దేశంలో మరే ముఖ్యమంత్రి చేయని రీతిలో ఆయనపై సీబీఐ విచారణకు ఆదేశించామని గుర్తు చేశారు.
అన్నిటా పారదర్శకంగా వ్యవహరిస్తున్నందున తమపై అవినీతి ఆరోపణలు కేవలం ప్రచార వ్యాఖ్యలు మాత్రమే కాగలవన్నారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా ఎపుడో చెప్పిందన్నారు.
|