తిరుపతిలోని శ్రీవారి సోదరి గంగమ్మ జాతర వైభవంగా ముగిసింది. ఐదు రోజుల పాటు ఈ జాతర ఉత్సవాలు బుధవారంతో ముగిసింది. ఉత్సవాల ఆఖరి రోజున వేలాది మంది భక్తులు తరలి వచ్చి గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు.
శ్రీవారి సోదరి తాతయ్య గుంట గంగమ్మగా తిరుపతిలో పేరుగాంచిన విషయం తెల్సిందే. మహిళల పట్ల వివక్ష చూపి, వారిని కష్టాలకు గురి చేసిన పాలి దొరను హతమార్చిన శ్రీవారి సోదరి గంగమ్మ భక్తుల కోర్కెలు తీర్చే దేవతగా పేరొందారు.
బంటు, తోటి, మాతంగితో సహా ఏడు రూపాల్లో గంగమ్మను అలంకరిస్తారు. చివరి రోజున గంగమ్మ విశ్వరూపాన్ని చూసేందుకు భక్తులు వేలాది మంది తరలివచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. భక్తులను అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప స్థాయిలో లాఠీ ఛార్జీ చేశారు.
|