రాష్ట్రంలో పెట్రోలియం, పెట్రోలియం కెమికల్ ఇన్వెస్ట్‌మెంట్ సెజ్ ఏర్పాటుకు రాష్ట్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పక్షంలో వైజాగ్-కాకినాడ కోస్తా తీరంలో దీనిని ఏర్పాటు చేస్తారు. దీనివల్ల విశాఖ, గంగవరం, కాకినాడ ఓడరేవులతో పాటు.. రెండు విమానశ్రయాలకు, ఆగ్నేయాసియా మార్కెట్‌కు ఎంతో అనుకూలంగా ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఏర్పడటంతో పెట్రో ఉత్పత్తుల సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు కేంద్రం దృష్టి సారించిన విషయం తెల్సిందే. ఇప్పటికే హిందుస్థాన్, ఓఎన్‌జీసీ వంటి పెట్రో సంస్థలు 73 వేల కోట్ల రూపాయలతో ఒక సెజ్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాయి. దీనివల్ల 3,43 వేల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు వస్తాయని, 58 వేల కోట్ల రూపాయల మేరకు పెట్రో ఉత్పత్తులు ఎగుమతులు అవుతాయని భావిస్తున్నారు.
|