రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరూ చేపట్టనంత స్థాయిలో అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టినందున మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. బలహీన వర్గాల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు చేపట్టేలా తమను ఆశీర్వదించాలని కోరారు.
చేవెళ్ల నుంచి ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ప్రజల నుద్ధేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకై ఇప్పటికే రూ. 12వేల కోట్ల రుణాలు మాఫీ చేయగా, ప్రస్తుతం పావలా వడ్డీ రుణాలను కూడా వారికి వర్తింపజేయనున్నామన్నారు.
పేద ప్రజల కోసమే రెండు రూపాయలకు కేజీ బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. ప్రజలు మెచ్చే పథకాలు చేపడుతున్నందున వారు తమను తప్పక ఆదరిస్తారన్న నమ్మకం తనకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.
|