తాము ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలన్నిటినీ నెరవేర్చామని ముఖ్యమంత్రి వైఎస్ అవాస్తవ ప్రచారం చేసుకుంటున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. 89 శాతం హామీలు అమలు చేశామని చెప్పుకోవడం సిగ్గు చేటని అన్నారు.
నిజామాబాద్ జిల్లా, ఎల్లారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరుతెన్నులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అధికారంలోకి రాకముందు, తర్వాత ఇప్పటివరకు 205 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిలో ప్రాధాన్యం లేని 105 హామీలను మాత్రమే అమలు చేస్తోందన్నారు.
|