రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మరికొంత మంది తీవ్ర గాయాల పాలయ్యారు. కడప జిల్లా రాయచోటి మండలం అబ్బవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. అలాగే.. చిత్తూరు జిల్లాలో తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లోని ఎన్ఆర్.పేట అనే ప్రాంతం వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
ఇకపోతే నెల్లూరు జిల్లా ముంబై జాతీయ రహదారిలో ఉన్న వేగూరు కాల్వ వద్ద వ్యాను-ఆటో ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మృతులంతా బుచ్చిరెడ్డి పాళెం ప్రాంతానికి చెందినవారు. ఈ ప్రమాదాలపై ఆయా ప్రాంతాలకు చెందిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
|