ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అగ్నిగుండంగా సింగరేణి బొగ్గు గని  Search similar articles
FileFILE
రాష్ట్రంలో వేసవి ఉష్టోగ్రతలు ఒక్కసారి పెరిగిపోయాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా గోదావరిఖని, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో సూర్యుని ప్రతాపం ఎక్కువగా ఉంది. గత నాలుగైదు రోజులుగా ఈ ప్రాంతాల్లో యాభై డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. గత ఎనిమిది సంవత్సరాల్లో ఇదే అత్యధిక ఉష్టోగ్రత కావడం గమనార్హం.

ఈ సూర్యతాపం కారణంగా సింగరేణి కార్మికులు భయాందోళన చెందుతున్నారు. సుమారు 76 వేల మంది కార్మికులు పని చేసే సింగరేణి బొగ్గు గనుల పనులకు ప్రస్తుతం సగం మంది మాత్రమే హాజరవుతున్నారు. దీంతో ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోతోంది.

అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గరిష్ట ఉష్టోగ్రత ధాటికి ఇప్పటి వరకు 53 మంది మృతి చెందారు. సాధారణంగా వేసవి సమయంలో చలివేంద్రాలను ఏర్పాటు చేసే ప్రభుత్వం, ఈ దఫా మాత్రం వాటి జోలికి వెళ్లలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రత వివరాలను కూడా ప్రభుత్వం ప్రకటించక పోవడం గమనార్హం.
వీడియోను వీక్షించండి
మరిన్ని
వైభవంగా అన్నవరం కళ్యాణోత్సవాలు  
వివిధ రోడ్డు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం
హామీలపై వైఎస్ అవాస్తవ ప్రచారం: బాబు ధ్వజం
అభివృద్ధి చేశాం...మద్దతు కోరుతున్నాం: వైఎస్
తెలంగాణా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: వైఎస్  
పెట్రోలియం సెజ్ ఏర్పాటుకు రాష్ట్రం ప్రతిపాదన