కర్నూలు జిల్లాలోని ప్రముఖ ఫ్యాక్షనిస్టు కప్పట్రాళ్ళ వెంకటప్ప నాయుడు మృతి కేసులో సంబంధమున్న దోషులను కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర హోం మంత్రి జానా రెడ్డి స్పష్టం చేశారు. వెంకటప్ప నాయుడు అనుమానాస్పద రీతిలో శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెల్సిందే. దీంతో ఆయన అనుచరులు కొడుమూరు వద్ద విధ్వంసానికి పాల్పడ్డారు. ఆర్టీసి బస్సు అద్దాలను పగులగొట్టారు.
దాదాపు 15 గ్రామాలకు చెందిన కప్పట్రాళ్ళ అనుచరులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ నేత హత్యకు మూడు రోజుల నుంచి కాంగ్రెస్ నేతలు కుట్ర పన్నారని కప్పట్రాళ్ళ అనుచరులు ఆరోపించారు.
పోలీసులు మాత్రం వెంకటప్ప నాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని పోలీసులు పేర్కొంటున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని కర్నూలుకు చెందిన విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశారు. ఈ లారీ డ్రైవర్, క్లీనర్‌లు పరారీలో ఉన్నారు. ఈ కేసులో దోషులను గుర్తించి, తగిన విధంగా చర్యలు చేపడుతామని హోం మంత్రి జానా రెడ్డి స్పష్టం చేశారు.
|