విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 లక్షల మేర ఆస్థి నష్టం సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం.
ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ ప్రమాదానికి కారణాలు ప్రస్తుతానికి తెలియరాలేదు. దీంతో ప్రమాద కారణాలను గురించి తెలుసుకోవడానికి నగర పోలీస్ కమీషనర్ ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించారు.
|