|
సొంత ఊరికి చేరుకున్న జ్యోతిర్మయి మృతదేహం
|
 |
|
|
|
|
|
శనివారం, 24 మే 2008( 16:54 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | బ్రిటన్‌లోని బర్మింగ్‌హ్యామ్‌లో హత్యకు గురైన విజయవాడ విద్యార్థిని జ్యోతిర్మయి మృతదేహం ఎట్టకేలకు శనివారం ఉదయం విజయవాడకు చేరుకుంది. శవపేటికను చూడగానే విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. వీరి రోదనలతో ఆ ప్రాంతమంతా శోకసముద్రాన్ని తలపించింది. మృతదేహం వెంట యూనివర్శిటీ ప్రతినిధులు కూడా వచ్చారు.
యూనివర్శిటీ సమీపంలో నివశిస్తున్న జ్యోతిర్మయి ఈనెల ఆరో తేదీన అనుమానాస్పదస్థితిలో హత్యకు గురైన విషయం తెల్సిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక విద్యార్థిని అరెస్టు చేశారు. ఇదిలావుండగా బ్రిటన్ ప్రభుత్వం లాంఛనాలన్నీ పూర్తయిన తర్వాత మృతదేహం శనివారం విజయవాడకు తీసుకొచ్చారు.
మృతదేహం వెంట వచ్చిన వోల్వర్ యూనివర్శిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయానికి జ్యోతిర్మయి చెల్లించిన 6.5 లక్షల రూపాయల ఫీజును తిరిగి చెల్లించనున్నట్టు చెప్పారు. అంతేకాకుండా.. జ్యోతిర్మయి సోదరికి తమ యూనివర్శిటీలో ప్రవేశం కల్పిస్తామని వారు వివరించారు.
|