|
రాష్ట్రంలో నైరుతి రుతపనాల తొలకరి జల్లులు
|
 |
|
|
|
|
|
మంగళవారం, 3 జూన్ 2008( 16:34 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | గత రెండు మూడు నెలలుగా వేసవి ఎండలతో బెంబేలెత్తి పోయిన రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఎపుడెపుడు ప్రవేశిస్తాయా? అని ఎదురు చూస్తున్న వారి కోరిక నెరవేరింది. సోమవారం సాయంత్రమే నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడా తొలకరి జల్లులు పలుకరించాయి.
వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే నిర్ణీత గడువుకు ముందే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశాలు వున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా కోస్తా ఆంధ్రలోని కాకినాడ వరకు విస్తరించినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సుంకరి వెంకటేశ్వర్లు తెలిపారు.
సాధారణంగా రాష్ట్రంలో నెల్లూరుకు జూన్ ఐదు, ఆరు తేదీల్లో రుతుపవనాలు వస్తుంటాయి. అయితే ఈ ఏడాది రుతుపవనాల వేగం ఎక్కువగా ఉండడంతో మూడు రోజులకు ముందే వచ్చాయన్నారు. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ప్రవేశించిన రుతుపవనాల కారణంగా అక్కడ ఓ మోస్తరు వర్షాలు పడుతున్న విషయం తెల్సిందే.
|