ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆర్టీసీ ఛార్జీల పెంపునకు ముఖ్యమంత్రి పచ్చజెండా  Search similar articles
FileFILE
పెట్రో ధరల పెంపు ప్రభావం ఒక్కోదానిపై చూపుతోంది. ఇప్పటికే నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని తాకివున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలను పెంచిన విషయం తెల్సిందే. పెట్రో వడ్డన వల్ల రాష్ట్ర రవాణా సంస్థపై కోట్లాది రూపాయల మేరకు భారం పడుతోంది.

ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలను పెంచేందుకు అనుమతి ఇవ్వాలని యాజమాన్యం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది. ఛార్జీల పెంపుపై ఉన్నతాధికారులో చర్చలు జరిపిన సీఎం స్వల్పంగా ఛార్జీలు పెంచేందుకు అనుమతి ఇచ్చారు.

దీనిపై సీఎం మాట్లాడుతూ లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజల్‌పై రూ.3 చొప్పున ధరలు పెరిగినప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కూడా ఆమాత్రం కాకపోయినా, కనీసం 30 లేదా 40 పైసలు వంతునైనా పెంచేందుకు అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు.

అయితే రాష్ట్రంలో వంట గ్యాస్ వినియోగదారులు కోటి ఐదు లక్షలు మంది ఉన్నారని, వారిపై అధిక భారం పడకూడదనే ప్రధాన ఉద్దేశంతో కేంద్రం పెంచిన రూ.యాభై భారాన్ని ప్రభుత్వం భరించాలని నిర్ణయించినట్టు చెప్పారు.
వీడియోను వీక్షించండి
మరిన్ని
అన్నదాత సంక్షేమమే మా ధ్యేయం: వైఎస్
11న ఉప ఎన్నికల ఫలితాలపై తెదేపా సమీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు... రైల్ రోకోలు
లేఖ రాయడం రాజకీయ జిమ్మిక్కు: బాబు
నేటి ఆర్థరాత్రి నుంటి ఆటో-క్యాబ్‌ల సమ్మె  
ఉప 'పురపాలన'లోనూ కాంగ్రెస్‌దే పై'చేయి'