ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఓటమితో గుణపాఠాలు: తెరాస అధినేత  Search similar articles
ముగిసిన ఉప ఎన్నికల్లో ఎదురైన ఓటమితో గుణపాఠాలు నేర్చుకోవాలని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కే.చంద్రశేఖర రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహబాబునగర్ జిల్లా నాగర్‌కర్నూల్ పట్టణంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఉప ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి తేరుకుని పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు కార్యకర్తలు కేసీఆర్ వైఖరిని ప్రశ్నించారు. రాజీనామాలు ఎవరిని అడిగి చేశారని ప్రశ్నించారు.

ఇదిలావుండగా కేసీఆర్ శుక్రవారం నల్లగొండ జిల్లా భువనగిరిలో జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు జిల్లాల్లో పర్యటించాలని కేసీఆర్ నిర్ణయించారు.
మరిన్ని
నెల్లూరు జిల్లాలో బంగ్లా యువకుడి అరెస్టు
త్వరలో కొత్త డిఎస్సీ నోటిఫికేషన్: ప్రభుత్వం ప్రకటన
విశాఖ 'బెల్టు'పై రోజా దాడి  
చిన్నగంజాంలో నారాయణ అరెస్ట్  
ఎస్ఈజడ్‌ల పేరు 'రియల్' వ్యాపారం
హైదరాబాద్‌లో 2కే రన్