|
మద్యం షాపుల టెండర్ల కోసం పోటాపోటీ
|
 |
|
|
|
|
|
శనివారం, 14 జూన్ 2008( 16:24 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మద్యం షాపుల టెండర్లను దక్కించుకునేందుకు తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బెల్టు షాపులకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన సాగుతోంది. అయితే రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నూతన ఎక్సైజ్ విధానంలో భాగంగా 348 మద్యం షాపులకు టెండర్లు ఆహ్వానించారు. ఇందులోభాగంగా వీటిని దక్కించుకునేందుకు నెల్లూరు జిల్లాలో పోటీ తీవ్రంగా ఉంది.
కేవలం మద్యం వ్యాపారులే కాకుండా రియల్ ఎస్టేట్ యజమానులు సైతం వీటికి పోటీ పడుతుండటంతో గట్టి పోటీ నెలకొంది. ఈ మద్యం షాపుల టెండర్ల ద్వారా ప్రభుత్వానికి 160 కోట్ల రూపాయల మేరకు ఆదాయం లభించవచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా రాష్ట్రంలో మద్యం షాపులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మహిళలే టెండర్లకు పోటీ పడటం పెద్ద చర్చనీయాంశమైంది.
|