|
సమ్మెకు దిగనున్న లారీ యజమానులు
|
 |
|
|
|
|
|
సోమవారం, 30 జూన్ 2008( 18:50 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | పెట్రో ధరల పెంపు అన్నింటిపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలపై తీవ్ర ప్రభావం చూపిన పెట్రో వడ్డన లారీపై కూడా ప్రభావం చూపాయి. దీంతో సమ్మెకు దిగాలని లారీ యజమానులు నిర్ణయించారు. సరుకుల రవాణాలో కీలక పాత్ర పోషించే లారీలు సమ్మెకు దిగినట్టయితే నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరిగే ప్రభావం ఉంది.
పెరిగిన పెట్రో ధరల వల్ల తమపై మరింత భారం పడిందని, ఇలాంటి పరిస్థితుల్లో లారీలను నడపడం తమ వల్ల కాదని లారీ యజమానులు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా పన్నులన్నీ సక్రమంగా చెల్లిస్తున్నప్పటికీ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు, పోలీసులు తమను వేధిస్తున్నారని వారు వాపోతున్నారు.
|