తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తున్న శ్రీవారి అమృతోత్సవాల సందర్భంగా తితిదే ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి గుర్తింపు డాలరును ఆవిష్కరించారు. వీటిని భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఈ డాలర్లను రాగి లోహంతో తయారు చేసినట్టు తెలిపారు. అలాగే శ్రీవెంకన్న ఆన్నదాన మందిరంలో ఇకపై భక్తులకు ముద్దపప్పు నెయ్యి వడ్డించే పథకాన్ని కూడా కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు.
ఇప్పటికే తితిదే సర్వభోజన పథకాన్ని ఆమలు జరుపుతున్న విషయం తెల్సిందే. తాజాగా శ్రీవారి భక్తులకు ముద్ద పప్పు నెయ్యిని కూడా వడ్డించాలని నిర్ణయించామని చెప్పారు. అన్నం వ్యాపారం తిరుమలలో ఏమాత్రం జరుపకుండా భక్తులందరికి ఉచితంగా భోజనం పెట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు.
ఇందులోభాగంగానే శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులు ఒకేసారి పదివేల మంది కూర్చొని భోజనం చేసేందుకు వీలుగా భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాగా, ముద్దపప్పు, నెయ్యి పథక ప్రారంభోత్సవానికి తితిదే ఈవో రమణా చారి, తిరుమల ప్రత్యేకాధికారి ఏ.వి.ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భక్తులకు త్రాగునీరు కొరతను తీర్చడానికి చౌక ధరకే మినిరల్ వాటర్ వసతిని తితిదే ప్రాంభించింది.
|