రాష్ట్రంలో ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో ప్రసారాలు ఎక్కువయ్యాయి. ఎఫ్ఎం రేడియోల సందడితో శ్రోతలు నిత్యం ఆనందభరితులవుతున్నారు. ప్రభుత్వ రేడియో కార్యక్రమాలను తోసిరాజని ప్రైవేట్ ఎఫ్ఎంలు విభిన్న తరహా ప్రసారాలతో శ్రోతలను మరింతగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే బిగ్ ఎఫ్ఎం, రేడియో మిర్చీ, సూర్య ఎఫ్‌ఎం వంటి ప్రైవేట్ సంస్థలు అటు శ్రోతలను ఆకర్షించడమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి.
ఒకప్పుడు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి వంటి ప్రాంతాలకే పరిమితమైన ఎఫ్ఎం ప్రసారాలు ప్రస్తుతం ద్వితీయ శ్రేణి ప్రాంతాలపై కూడా దృష్టి సారించాయి. ఇందులోభాగంగా తాజాగా వరంగల్‌లో కూడా ఈ ప్రసారాలు ఆరంభమయ్యాయి. వంద కిలోమీటర్ల రేడియోస్‌తో ప్రసారమయ్యే ఈ ప్రసారాలు రెండు మూడు జిల్లాల శ్రోతలను ఆలరిస్తూ మరింత ముందుకు సాగుతున్నాయి.
|