ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రజాధనాన్ని వినియోగిస్తే చాలు: బాబు  Search similar articles
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విజయవంతంగా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జోలె పట్టనవసరంలేదని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల సోమ్మును కాజేయకుండా, సక్రమంగా ఖర్చు చేస్తే చాలని ఆయన హితవు పలికారు. 'మీకోసం' యాత్రలో భాగంగా బాబు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా కోటనందూరు మండలంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లడారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి ప్రభుత్వం చేపట్టిన పథకాలను జోలె పట్టయినా పూర్తిచేస్తామని ప్రకటించడాన్ని బాబు ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ తినడం మానేస్తే రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి ప్రజల నిధులను స్వాహా చేయడం మానేస్తే అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ప్రజలను అన్ని విధాలా నిలువు దోపిడీ చేస్తున్నారని బాబు ధ్వజమెత్తారు. వైఎస్సార్ ఐదేళ్ళ దోపిడీ పాలనా రాష్ట్ర చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచి పోతుందని చంద్రబాబు ఆరోపించారు.
మరిన్ని
ప్రత్యేక తెలంగాణాకు తెదేపా అనుకూలం: ఎర్రబెల్లి
రాష్ట్రంలో ఎఫ్ఎంల సందడే సందడి  
శ్రీవారి అమృతోత్సవాల గుర్తింపు డాలరు ఆవిష్కరణ
ఈనెల 19, 20 తేదీల్లో ఆర్టీసి సమ్మె
విద్రోహ శక్తుల ఆటకట్టిస్తాం: జానారెడ్డి
మావోయిస్టులు మూల్యం చెల్లించక తప్పదు : వైఎస్‌