ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అమెరికాలో తెలుగు కోర్సు ప్రారంభానికి ఏర్పాట్లు  Search similar articles
అమెరికాలోని అట్లాంటా నగరంలో ఉన్న యమరీ విశ్వవిద్యాలయంలో తెలుగు కోర్సు ప్రాంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులోభాగంగా అట్లాంటా నగరంలోని తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది.

ఈ సమవేశంలో రాష్ట్ర హిందీ అకాడెమీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ అంతర్జాతీయ తెలుగు అధ్యయన సంస్థ ద్వారా యమరీ యూనివర్శిటీలో తెలుగు కోర్సు ప్రాంరంభానికి సహకరిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కోర్సుకు సుమారు రెండు లక్షల డాలర్ల నిధి అవసరమవుతుందని అట్లాంటా తెలుగు సంఘ అధ్యక్షురాలు శ్రీ దేవి పేర్కొన్నారు.

ఇప్పటివరకు 75 వేల డాలర్లను ఓ దాత అందజేశారని ఆమె తెలిపారు. మిగిలిన నిధుల సేకరణ చేపట్టతామని ఆమె తెలిపారు. ప్రముఖ కళాకారుడు గజల్ శ్రీనివాస్ నిధుల సేకరణకు ఉచిత ప్రదర్శనలు ఇస్తారని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్.ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని
ప్రజాధనాన్ని వినియోగిస్తే చాలు: బాబు
ప్రత్యేక తెలంగాణాకు తెదేపా అనుకూలం: ఎర్రబెల్లి
రాష్ట్రంలో ఎఫ్ఎంల సందడే సందడి  
శ్రీవారి అమృతోత్సవాల గుర్తింపు డాలరు ఆవిష్కరణ
ఈనెల 19, 20 తేదీల్లో ఆర్టీసి సమ్మె
విద్రోహ శక్తుల ఆటకట్టిస్తాం: జానారెడ్డి