ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మావోయిస్టులతో చర్చలకు ఎల్లపుడూ సిద్ధం: జానా  Search similar articles
మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర హోం మంత్రి జానారెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటామనే వ్యాఖ్యలు తాము చేయలేదన్నారు. గతంలో హింసావాదానికి స్వస్తి పలకాలనే ఉద్దేశంతోనే మావోయిస్టులతో చర్చలు జరిపామని గుర్తుచేశారు.

మావోయిస్టులకు, ప్రభుత్వానికి మధ్య చర్చలు నిర్వహణ కోసం మధ్యవర్తిగా ఎవరు ముందుకు వచ్చినా ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. మావోయిస్టులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతూనే మరోవైపు ప్రతికారం తీర్చుకుంటామని ఎలా హెచ్చరిస్తామని ఆయన ప్రశ్నించారు.

కాగా ఈ అంశంపై తీవ్రంగా పున:పరిశీలిస్తామని ఆయన తెలిపారు. గ్రేహౌండ్స్ సిబ్బందిపై మావోయిస్టులు దాడి సంఘటనపై ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం నక్సలిజాన్ని చాలావరకు అణచి వేసిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రశంల వర్షం కురిపించిందన్నారు. రాష్ట్ర గ్రేహౌండ్స్ దళాలు పొరుగు రాష్ట్రాలకు సైతం శిక్షణ ఇప్పిస్తున్నాయని మంత్రి జానారెడ్డి గుర్తు చేశారు.
మరిన్ని
17 నుంచి రెండో విడత ఆరోగ్య శ్రీ!
ఫిబ్రవరి తర్వాతే ఎన్నికలు : వైఎస్సార్
అమెరికాలో తెలుగు కోర్సు ప్రారంభానికి ఏర్పాట్లు
ప్రజాధనాన్ని వినియోగిస్తే చాలు: బాబు
ప్రత్యేక తెలంగాణాకు తెదేపా అనుకూలం: ఎర్రబెల్లి
రాష్ట్రంలో ఎఫ్ఎంల సందడే సందడి