రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రరూపం దాల్చింది. ముడిచమురు నివారణ చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగావిఫలమైంది. దీనివల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో డీజిల్ దోరకని పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లోని నల్లబజారులో రూ. 50ల ధరతో గుబులురేపుతోంది. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో డీజల్ దొరక్క వ్యవసాయదారులు అందోళన చెందుతున్నారు.
ముడిచమురు కంపెనీలు డీజిల్, పెట్రోల్ సరఫరాలను తగ్గించేశాయి. లీటరుకు రూ.5 పెరిగిన బ్రాండెడ్ పెట్రోల్, డీజిల్ సరఫరాపై ముడిచమురు కంపెనీలు మోగ్గుచుపుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 300 బ్యాంకుల్లో సాదారణ పెట్రోల్, డీజిల్ లభించటంలేదు. బ్రాండెడ్ పెట్రోల్, డీజిల్ రాష్ట్రంలో 600 బ్యాంకులకు సరఫరా చేసేందుకు ముడిచమురు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి.
సాధారణ డీజిల్‌ను బాడావ్యక్తులు అధికమొత్తంలో నిల్వచేసుకుని నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వ్యవసాయ పనులకు డ్రీజిల్ లెకపోవడంతో రైతన్నలు అందోళనకు దిగారు. వారం రోజులకు ముందు బ్రాండెడ్ పెట్రోల్, డీజిల్ విక్రయంపై ముడిచమురు కంపెనీలకు పౌరసరఫరా శఖ కమిషనర్ పూనం మాలకొండయ్య హెచ్చరించారు.
|