ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఎంసెట్ కౌన్సెలింగ్ తీరుపై విద్యార్థులు ఆందోళన  Search similar articles
2008-09 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ తేదీలను నిర్ణయించక పోవటంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బైపీసీ గ్రూపుకు చెందిన కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేయకపోవడంతో విద్యార్థులు అయోమయం చెందుతున్నారు. ఈ నెల 16 నుంచి ఇంజినీరింగ్ కోర్సుల్లో కౌన్సెలింగ్‌ ప్రారంభంకానున్న విషయం తెల్సిందే.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగాల్సిన కౌన్సెలింగ్‌ను ఈ ఏడాది ఉన్నత విద్యాశాఖకు నిర్వహించనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కౌన్సెలింగ్‌పై ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీ అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం ఉన్నత విద్యామండలి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ఈ నెల 22 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించాలని యూనివర్సిటీకి సమాచారం అందించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ యూనివర్సిటీ అధికారికంగా ప్రకటించాల్సిఉంది.

ఎన్టీఆర్ యూనివర్సిటీలో జూలై తొమ్మిదో తేదీ నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ జరుగనుంది. ఈనెల ఐదో తేదీ నుంచి ఎండి హోమియో, ఎమ్మెస్సీ (మెడికల్) కౌన్సెలింగ్‌ను తొమ్మిదో తేదీన, నర్సింగ్ కోర్సు కౌన్సెలింగ్ 16వ తేదీన జరుగనున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎండీ (ఆయుర్వేద, యునానీ) కౌన్సెలింగ్ వాయిదా పడిన విషయం తెల్సిందే.
మరిన్ని
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత
మావోయిస్టులతో చర్చలకు ఎల్లపుడూ సిద్ధం: జానా
17 నుంచి రెండో విడత ఆరోగ్య శ్రీ!
ఫిబ్రవరి తర్వాతే ఎన్నికలు : వైఎస్సార్
అమెరికాలో తెలుగు కోర్సు ప్రారంభానికి ఏర్పాట్లు
ప్రజాధనాన్ని వినియోగిస్తే చాలు: బాబు