ఇటీవల ముగిసిన ఉప ఎన్నికల్లో చావుదెబ్బతిన్న తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస)కు ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు. ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు పలువులు వింతతరహాలో అల్లర్లకు పాల్పడుతున్నారు. తెలంగాణా ప్రాంతాల్లో ఉన్న ఆంధ్ర భోజనం, రెడ్డి మెస్‌లపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. దీంతో హడలిపోయిన మెస్ యజమానులు తమ భోజనశాలలను మూసి వేస్తున్నారు.
తెరాస కార్యకర్తలు ఇటీవల సంగారెడ్డిలో ప్రదర్శించిన నిరసన కూడా పెద్ద వివాదాస్పదమైంది. తెరాస కార్యకర్తల వ్యవహారశైలిపై అన్ని పార్టీల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవి క్రమంగా తెలంగాణా ప్రాంతంలోని ఇతర ప్రదేశాలకు కూడా వ్యాపిస్తున్నాయి. దీంతో ఆంధ్ర ప్రాంతానికి హోటల్ యజమానులు బెదిరి పోయి తమ హోటళ్ళను మూసి వేస్తున్నారు.
|