ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రజలు నమ్మే స్థితిలో లేరు : ఆనం  Search similar articles
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని సమాచార శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. కలెక్టర్లు అవినీతికి సాక్ష్యంగా నిలుస్తున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

ఈ విషయమై గురువారం జూబ్లీహాల్ ఆవరణలో మీడియా ప్రతినిధుతులతో మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే బాబు ఈవిధంగా వ్యాఖ్యానిస్తున్నారని ఆనం ఆరోపించారు. రాష్ట్ర ప్రగతిని చూసి ఏమీ మాట్లాడుతున్నామో తెలియని అయోమయస్థితిలో ఉన్నారని ఆనం ధ్వజమెత్తారు.

ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి అవినీతికి కలెక్టర్లే ప్రత్యక్ష సాక్షులని తూర్పు గోదావరి జిల్లా "మీకోసం" యాత్రలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాము అధికారంలో ఉన్న సమయంలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి పారదర్శకత పాటించామని, అవినీతి ఎక్కడ బయటపడుతుందనే భయంతో ప్రస్తుత వైఎస్సార్ ప్రభుత్వం వీటిని నిర్వహించడం లేదని బాబు ధ్వజమెత్తారు.
మరిన్ని
"కంత్రి" సినిమాపై మందకృష్ణ గళం
అక్టోబర్ నుంచి అర్హులకు పింఛన్లు
వెబ్‌దునియా క్లాసిఫైడ్స్... మీకోసం...
అవినీతిని ఏ మాత్రం సహించొద్దు : సీఎం
"చిరు"పార్టీపై అన్నివర్గాలు ఆసక్తి : మిత్రా
కులవివక్షకు స్వస్తి చెప్పాలి : జయప్రకాశ్