ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సిలేరులో మరో మూడు మృతదేహాలు లభ్యం  Search similar articles
ఒరిస్సాలోని చిత్రకొండ పోలీసు స్టేషన్ పరిధిలో మావోయిస్టులు చేసిన మెరుపుదాడిలో తొమ్మిది మంది గ్రేహౌండ్స్ బలగాలు తీవ్రంగా గాయపడగా మరో 35 మంది నీటిలో గల్లంతయిన విషయం తెలిసిందే. కాగా వారికోసం బలిమెల పరిసర ప్రాంతాల్లో గాలింపు బృందాలు గాలింపు చర్యలు చేపట్టింది.

దాని ఫలితంగా గురువారం మరోమూడు మృతదేహాలను గాలింపు బృందం కనుగొన్నారు. ఈ గాలింపుల్లో దొరికిన శవాలను ఎస్సై శంకర్‌ రావు, చిత్రకొండ కానిస్టేబుళ్లు రంజన్ కుమార్ కోరా, సల్లావుద్దీన్‌లుగా గుర్తించామని గాలింపు బృందం తెలిపింది.

గత కొద్దిరోజులకు ముందుగా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం సీలేరునదిలో మావోయిస్టులు చేసిన భారీ దాడిలో గ్రేహౌండ్స్ దళాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. కాగా ఈ దాడులలో సుమారు 35 మంది పోలీసులు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు చేపట్టిన గాలింపుల్లో గల్లంతయిన వారిలో పదిమంది మృతదేహాలను సహాయక సిబ్బంది కనుగొన్నారు.
మరిన్ని
ప్రజలు నమ్మే స్థితిలో లేరు : ఆనం
"కంత్రి" సినిమాపై మందకృష్ణ గళం
అక్టోబర్ నుంచి అర్హులకు పింఛన్లు
వెబ్‌దునియా క్లాసిఫైడ్స్... మీకోసం...
అవినీతిని ఏ మాత్రం సహించొద్దు : సీఎం
"చిరు"పార్టీపై అన్నివర్గాలు ఆసక్తి : మిత్రా