బీసీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి వెల్లడించారు. బీసీలను అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వైఎస్సార్ స్పష్టం చేశారు. కొత్తగా పది కులాలను బీసీల్లో చేర్చడంతో పాటు పదో తరగతిలో 400 పైచిలుకు మార్కులు తెచ్చుకున్న బీసీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో విద్యనందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ను కలిసి బీసీ సంఘాలు అభినందించాయి.
ఇదిలా ఉండగా, రాజకీయాల్లో ప్రాబల్యం కోసం ఐక్యతతో మెలగుతూ వెనుకబడిన సామాజిక వర్గాల బలం చూపాలని పీసీసీ అధ్యక్షుడు డీఎస్ పిలుపు నిచ్చారు. గాంధీభవన్‌లో మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ అధ్యక్షతన పీసీసీ వెనుకబడిన వర్గాల విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో డీఎస్ మాట్లాడుతూ... చట్టసభల్లో బీసీలకు 150 సీట్లు ఇచ్చేందుకైనా తాను సిద్ధమేనని, అయితే ఇతరులు వారిని గెలవనిస్తారని అని సందేహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు 100 సీట్లు కేటాయించాలని పీసీసీ ఓబీసీ విభాగం చేసిన డిమాండ్‌కు డీఎస్ పైవిధంగా స్పందించారు.
|