ఓట్ల నమోదును ఒక ఉద్యమంగా తీసుకురావాలని మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఓటరు నమోదు అవగాహనపై నిర్వహించిన "వారధి" సదస్సులో ఆయన పాల్గొన్నారు. బ్రిటీష్ హయాంలో జమిందార్లకే ఓటు హక్కు ఉండేదని గుర్తు చేశారు.
ప్రస్తుతం భారత రాజ్యాంగం అందరికి ఓటుహక్కు కల్పించినా వాటిని సక్రమంగా వినియోగించుకోవడం లేదని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరికి ఓటు వెయ్యాలనే ఆలోచనే లేదని, ఏవరు అధికారంలోకొస్తే తమకెందుకనే భావన ఉంటున్నారని నాగబాబు పేర్కొన్నారు.
కొన్నిదేశాలలో ఓట్లను వేయకపోతే నేరంగా భావిస్తారని, మనదేశంలో అలాంటి చట్టాలు లేవని ఆయన ఎత్తిచూపారు. ఓట్ల ద్వారా మంచినాయకున్ని ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ నెల 7 తేదీ నుంచి 14 తేదీవరకు నిర్వహించే వారోత్సవాల్లో కార్యకర్తలు ప్రతి గ్రామాల్లో నమోదు కార్యక్రమాన్ని జరపాలని ఆయన పిలుపునిచ్చారు.
|