తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్యబద్ధమైన కోరికను అన్నిరాజకియ పార్టీలు గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నేత వినోద్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... సమైక్యావాదానికి చిరుపార్టీ కట్టుబడుతామనే సంకేతాలిస్తుందని వినోద్ తెలిపారు.
ఇది చిరు పార్టీకి మంచిది కాదని, తెలంగాణ వాదం చిరుపార్టీలోలేనట్లైతే ఆ పార్టీకి బలం ఉండదని వినోద్ సూచించారు. ప్రత్యేక తెలంగాణాకు చిరు పార్టీ వ్యతిరేకమంటే ఆ పార్టీకి తెలంగాణలో పురోగతులు ఉండవని ఆయన హెచ్చరించారు. సెంటిమెంటు, అభివృద్ధి ద్వారా జయించవచ్చనే చిరుపార్టీ రాజకీయ సలహాదారు మిత్రా వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు.
కాగా, తెలుగుదేశం పార్టీ తెలంగాణ అంశంపై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఆ పార్టీతో పొత్తును కుదుర్చుకునే అంశంపై పరిశీలిస్తామని వినోద్ తెలిపారు. సీపీఎం కారణం లేకుండానే ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తున్నాయని, ఇది వారి కుటిలబుద్ధికి నిదర్శనమని ఆరోపించారు.
|