రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ట్రాన్స్‌ఫోర్స్ పోలీసులు ఓ నకిలీ యూనివర్సిటీ గుట్టును బట్టబయలు చేశారు. గోల్కొండ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరుతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలో ఓ నకిలీ యూనివర్సిటీపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు.
ఇందులో భాగంగా నకిలీ యూనివర్సిటీని నడుపుతున్న అఫ్సరుద్ధీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ సుమారు 25 వేల నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ సర్టిఫికెట్లకు వినియోగించిన యంత్రసామగ్రిని, నగదును కూడా స్వాధీనపరుచుకున్నారు.
నకిలీయూనివర్సిటీ దాదాపు 13 ఏళ్లుగా కొనసాగుతున్నట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ వరకు పేరు, చిరునామా చెబితే చాలు ఏ సర్టిఫికెట్లాయినా ఇట్టే తయారు చేసి ఇస్తున్నట్లు విచారణలో తేలింది. ఒక్కో సర్టిఫికెట్‌కు ఐదు వేలనుంచి పదిహోనువేల దాకా అఫ్సరుద్ధీన్ నగదును తీసుకుంటాడని పోలీసులు తెలిపారు.
|