ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వెంకన్న సేవలో ప్రతిభా పాటిల్  Search similar articles
తిరుపతి దేవస్థానం (తితిదే) ఏర్పాటై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న అమృతోత్సవాలను ప్రారంభించేందుకు విచ్చేసిన భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ సోమవారం శ్రీవారిని సేవించుకున్నారు. సోమవారం ఉదయం 4 గంటలకు శ్రీవారి అర్చన సేవలో పాల్గొన్న ఆమె, అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అంతకు ముందు ఆలయ మర్యాదలతో వేద పండితులు పూర్ణకుంభంతో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ మహద్వారం వద్ద ఎస్వీ భక్తి ఛానెల్‌ను ప్రతిభా పాటిల్ లాంఛనంగా ప్రారంభించారు. తితిదే సొంతంగా ప్రారంభించిన ఈ ఆధ్యాత్మిక భక్తి ఛానెల్ ఉగాది పర్వదినం నుంచి టెస్ట్ సిగ్నల్స్ నడుస్తున్న సంగతి విదితమే.
వీడియోను వీక్షించండి
మరిన్ని
తెలుగు, కన్నడ భాషల ప్రాచీన హోదాపై పరిశీలన
త్వరలో పీసీసీ కార్యవర్గం : డీఎస్
తెలుగుదేశం పార్టీకి భూమా దంపతుల 'షాక్'
తాతయ్యగా మారిన 'మెగాస్టార్'
నేడు తిరుమలకు రానున్న రాష్ట్రపతి
వివాదాల సుడిగుండంలో తితిదే