విప్‌ను ధిక్కరిస్తే తర్వాత ఎదురయ్యే పరిణామాలకు తెరాస (ఎన్) అధ్యక్షుడు నరేంద్రే బాధ్యత వహించాల్సి వస్తుందని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. తెరాస అసమ్మతి సభ్యుడు నరేంద్రతో పాటు లోక్‌సభలో ముగ్గురు సభ్యులున్న టీఆర్ఎస్ యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా విప్ కూడా జారీ చేసింది. అయితే దీనిపై నరేంద్ర అభిప్రాయం కోరేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటు లేరు. పైగా మొదట్లో తెలంగాణ ఇస్తామంటే యూపీఏకు అనుకూలంగా ఓటేస్తానని నరేంద్ర ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కేసీఆర్ స్పందిస్తూ విప్‌ను ధిక్కరిస్తే ఎదురయ్యే పరిణామాలకు నరేంద్రనే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన వివరించారు.
మరోవైపు తెలంగాణపై తెదేపా విధానం త్వరలో మారుతుందని కేసీఆర్ ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా తెదేపా తీర్మానం చేస్తే ఆ పార్టీతో కలిసి పనిచేస్తామని అన్నారు. ఇరు పార్టీలు ఒక్కటైతే అద్భుత ఫలితాలు ఖాయమని కేసీఆర్ పేర్కొన్నారు.
|