తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై సమాజ్ వాదీ ఎంపీ, సినీనటి జయప్రద గళమెత్తారు. చంద్రబాబు నాయుడు సెక్యులర్ సిద్ధాంతాలకు తూట్లు పొడిచారని ఆమె ఆరోపించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకోవడం హాస్యాస్పదమని ఆమె ఎద్దేవా చేశారు.
మరోవైపు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం నుంచి, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు వరకు తెలుగుదేశం పార్టీ వహించిన కీలక పాత్రను ప్రస్తుత పరిణామాలు గుర్తు తెస్తున్నాయి. అణుఒప్పందం నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో తెదేపా చురుకైన పాత్రను పోషిస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్న యూపీఏ బలపరీక్షకు రంగం సిద్ధమైంది. లోక్‌సభ రెండు రోజుల ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా యూపీఏ ప్రభుత్వానికి మెజారిటీ లేదన్న విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని, తమకు సభలో అవసరమైనంత మెజారిటీ ఉందని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ప్రభుత్వం మైనార్టీలో పడిందనడానికి ఆధారాలు లేవని ఆయన అన్నారు.
|