రాష్ట్రంలో ఎదురవుతున్న విద్యుత్ సంక్షోభానికి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డే కారకుడని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. వైఎస్ విధానాల వల్లే రాష్ట్రంలో కరెంటు కష్టాలు ఎక్కువయ్యాయని ఆ పార్టీ పేర్కొంది.
ఈ విషయమై టీడీపీ అధికార ప్రతినిధి కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ అసమర్థత వల్లే రాష్ట్రం కరెంటు కష్టాలు ఎదుర్కొంటోందని అన్నారు. ఈ విషయంలో గత టీడీపీ పాలనను తప్పు పట్టడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత విద్యుత్ కష్టాలకు టీడీపీని విమర్శిస్తూ ప్రజలకు బహిరంగ లేఖ రాసిన వైఎస్ ఈ విషయంలో తానే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
|