ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
'చిరు' శిబిరంలో ఏర్పాట్లు ముమ్మరం  Search similar articles
FileFILE
మెగాస్టార్ రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలపై స్పష్టత ఏర్పడింది. పార్టీ ఏర్పాటుపై ఇప్పటి వరకు నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. పార్టీ ఏర్పాటు అనేకంగా ఆగస్టు 15 లేదా 22వ తేదీల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం చిరు శిబిరంలో నెలకొన్న పరిస్థితులను పరిశీలిస్తే.. పార్టీ ఏర్పాటు ప్రకటన తేదీ కాస్త ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది.

దీంతో హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వచ్చే నేతల సందడి ఎక్కువైంది. ముఖ్యంగా పార్టీలో చేరిన సీనియర్ నేతలంతా వచ్చే నెల 14వ తేదీకి అందుబాటులో ఉండాలని సంకేతాలు వెళ్లాయి. ఇదిలావుండగా చిరు సోదరులైన నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు యువ ఓటర్లను ఆకర్షించేలా కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే చిరంజీవి సలహాదారుడు డాక్టర్ మిత్ర ప్రత్యేకంగా వారధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. మొత్తం మీద చిరంజీవి రాజకీయ పార్టీ ఏర్పాటు ఇక లాంఛన ప్రాయంగా మిగిలింది.
వీడియోను వీక్షించండి
మరిన్ని
వైఎస్ విధానాల వల్లే విద్యుత్ ఇక్కట్లు : టీడీపీ
రౌడీయిజం నాకూ తెలుసు : ఉప్పునూతల
ముస్తాబవుతున్న "మెగాపార్టీ"?
యానిమేషన్ సిటీ ఏర్పాటు : దామోదర్ రెడ్డి
శ్రీకాకుళం హైవేలో రోడ్డు ప్రమాదం : ఆరుగురి మృతి
బాబు పొత్తుపై జయప్రద ధ్వజం!