ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మేఘ మథనానికి ఏర్పాట్లు : ప్రభుత్వం  Search similar articles
రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం మేఘ మథనం చేయడానికి నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ప్రారంభించడం కోసం ప్రభుత్వం సోమవారం ఓ జీవోను విడుదల చేసింది.

ఈ విషయమై అధికారులు మాట్లాడుతూ మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో భాగంగా 12 జిల్లాలో మేఘ మథనం కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. ఇందుకోసం దాదాపు రూ. 22 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వారు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఓ విమానం మేఘ మథనం కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ప్రారంభించనుందని వారు తెలిపారు.

అలాగే ఈ నెల 24 నుంచి మరో విమానం అనంతపురం నుంచి మేఘ మథనం కార్యక్రమాన్ని ప్రారంభించనుందని వారు తెలిపారు. ఆగ్ని ఏవియేషన్ కన్సల్టెంట్స్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమాన్ని జేఎన్‌టీయు, రెయిన్ షాడో ఏరియా డెవలప్‌మెంట్ శాఖలు పర్యపేక్షించనున్నాయి. వచ్చే 120 రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు.
మరిన్ని
విద్యుత్ రంగాన్ని విస్మరించిన వైఎస్సార్: బాబు
యూపీఏ వైపు 'టైగర్' నరేంద్ర మొగ్గు...!
'చిరు' శిబిరంలో ఏర్పాట్లు ముమ్మరం  
వైఎస్ విధానాల వల్లే విద్యుత్ ఇక్కట్లు : టీడీపీ
రౌడీయిజం నాకూ తెలుసు : ఉప్పునూతల
ముస్తాబవుతున్న "మెగాపార్టీ"?