యూపీఏ సర్కారు మంగళవారం సాయంత్రం విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్న నేపథ్యంలో పలుపార్టీల ఎంపీలు తమ ఓటును ఎటువైపు వేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఎంపీలు సైతం తమ మద్దతు కాసేపు వీరికని, కాసేపు వారికని చెబుతూ ఉత్కంఠతకు గురిచేస్తున్నారు.
తాజాగా టీడీపీ ఎంపీ ఆదికేశవులు నాయుడు యూపీఏకు అనుకూలంగా ఓటు వేస్తారన్న ప్రచారం హటాత్తుగా తెరమీదకొచ్చింది. రాష్ట్రంలోని చిత్తూరు నియోజవర్గం నుంచి టీడీపీ ఎంపీగా ఉన్న ఆదికేశవులు నాయుడు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన యూపీఏకు అనుకూలంగా ఓటు వేసేందుకు సిద్ధమయ్యారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
టీఆర్ఎస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఆదికేశవులు నాయుడుకు ఇష్టం లేదని యూపీఏకు ఓటు వేయడం ద్వారా ఈ విషయాన్ని అధిష్టానానికి తెలియజేయాలని ఆయన భావిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయమై ఆదికేశవుల్ని కలిసిన టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన మాట్లాడుతూ ఇవన్నీ పుకార్లేనని స్పష్టం చేసినట్టు సమాచారం.
|